TG: BRS హయాంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ దోపిడీపై BJP ఎందుకు ప్రశ్నించటం లేదు. దర్యాప్తు సంస్థలు కేవలం BRS నేతలపైనే దాడులు చేస్తాయా? దమ్ముంటే అమృత్ వర్కులపై దర్యాప్తు జరిపించాలి. ముగ్గురు కుంభకోణాలు చేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. సీఎం బావమరిది, పొంగులేటి కంపెనీలకే టెండర్లు ఇస్తున్నారు. RR టాక్స్ అని ఆరోపించిన మోదీ మెదపటం లేదు’ అని విమర్శించారు.