జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఆ రాష్ట్ర బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. సోరెన్ 2019 ఎన్నికల అఫిడవిట్లో తన వయసు 42 ఏళ్లుగా పేర్కొన్నారని.. కానీ ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో 49 ఏళ్లుగా చూపించారని ఆరోపించారు. ఐదేళ్లలో సీఎం వయసు ఏడేళ్లు ఎలా పెరుగుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేశామని స్పష్టం చేసింది. సోరెన్ నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది.