AP: అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఏఐ అవకాశాల వినియోగంతో శరవేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని లోకేశ్ అన్నారు. ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు చేశామన్నారు.