AP: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం, పోలవరం ఎడమ కాలువ పనులపై సమీక్షించారు. ఈ వారం వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ, లైనింగ్ పనులపై ఆదేశాలు జారీ చేశారు. నవంబర్లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.