ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరకి.. ఇక దాడి ముగిసిందని ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రతీకారానికి పాల్పడితే తప్ప తాము స్పందించమని వెల్లడించారు. ఆ సందర్భంలో తాము మరింత శక్తివంతంగా, తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాగా.. అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ తాజా ప్రకటన చేసింది.