అమెరికాలో నవంబరులో వచ్చే తొలి మంగళవారం ఎన్నికలు జరగడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే మంగళవారమే ఎందుకు నిర్వహిస్తారనే చర్చ మొదలైంది. 1800నాటి కాలంలో US ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా ఉండేది. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు నవంబర్‌ను ఎన్నికల నిర్వహణకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణించడానికి ఇష్టపడనందున.. సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని భావించినట్లు సమాచారం.