కేంద్ర మంత్రి అమిత్ షాపై కెనడా ఆరోపణలు చేసింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనక భారత హోంశాఖ మంత్రి అమిత్ షా పాత్ర ఉందంటూ ఇటీవల ట్రూడో సర్కారు ఆరోపణలు చేసింది. దీంతో ఈ ఆరోపణలు అసంబద్ధమైనవని, నిరాధారమైనవని భారత్ కొట్టిపారేసింది. ఈ క్రమంలోనే కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన తెలిపినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.