ప్రతిపక్షాల ఐక్యత పార్టీ బలోపేతానికి కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈసారి బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
మణిపూర్‌లో నిరంతరం హింసాకాండ కొనసాగుతోంది. స్థానికి మీడియా ప్రకారం..ఆదివారం హింస(Violence) చెలరేగిన హింసలో ఒక పోలీసు(police)తో సహా కనీసం ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. అదే సమయంలో చాలా చోట్ల పౌరులు, ఉగ్రవాదులు, భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఘటనలు తెరపైకి వచ్చాయి.
అహ్మదాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన పడటంతో ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా వరణుడు ఆటంకం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)కు 4 అవార్డులు వరించాయి. థియేటర్లో ఫెయిల్ అయిన ఈ మూవీకి ప్రశంసలు, అవార్డులు రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
రాబోయే ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాగల ఐదు రోజులు తెలంగాణ (Telangana) లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నందమూరి తారక రామారావు మే 28న పుట్టారు. 2023 మే 28తో 100 సంవత్సరాలు పూర్తవుతుండటంతో తెలుగు ప్రజలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పాత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.