»Mayor Marriage With A Crocodile You Will Be Surprised To Know The Matter
Viral video: మొసలితో మేయర్ పెళ్లి…ఎందుకో తెలుసా?
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
Mexico city: సాధారణంగా మన దేశంలోని చాలా పల్లే ప్రాంతాల్లో వర్షాలు పడటం కోసం వినూత్నమైన పద్దతుల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కప్పల పెళ్లిల్లు అని చేస్తూ ఉంటారు. ఇలా ఎవరి సాంప్రదాయం వారికి ఉంటుంది. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలంతా కలిసి ఆ ప్రాంత పట్టణ మేయర్(mayor) కు ఆడ మొసలి(crocodile)తో వివాహం(marriage) జరిపించారు. దక్షిణ మెక్సికో (southern Mexico)లోని శాన్ పెడ్రో హువామెలులా (San Pedro Huamelula)అనే పట్టణంలో ఓ వింతైన సంప్రదాయం జరిగింది. విక్టర్ హ్యూగో సోసా (Victor Hugo Sosa,) అనే మేయర్ చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో అలీసియా అడ్రియానా అనే ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. 230 ఏళ్లుగా తమ పూర్వికుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఇలా వివాహం జరిపించడం వల్ల తమ ప్రాంతంలోని ప్రజలకు అదృష్టంతో పాటు అష్టఐశ్వర్యాలు కలుగుతాయనేది వారి నమ్మకం అట. ఇలా పెళ్లాడే మేయర్ ను చొంటల్ రాజుగా.. అలాగే మొసలిని రాణిగా భావిస్తారు.
మొసలి(crocodile)తో పెళ్లి అంటే ఆశ్చర్యంగా ఉన్నా ఆ వేడుక పూర్తి విషయాలను తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. సాధరణంగా పెళ్ళికి ముందు వధువరులకు మంగళస్నానాలు చేయిస్తారు కదా.. అలాగే పెళ్లికి ముందు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలికి సంప్రాదాయ(traditional) స్నానాలు చేయించి, పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ తతంగం అంతా చేస్తుంటే మొసలి ఏం చేయదా అంటే ముందుగానే దానికి ముక్కును తాడుతో జాగ్రత్తగా కట్టెస్తారు. అలా మత్స్యకారులు వలలతో నృత్యాల్లో పాల్గొంటారు. ఈ వేడుకను ఒక పెద్ద పండుగగా నిర్వహిస్తారు. వరుడు అయిన మేయర్ మొసలిని ఎత్తుకుని డ్యాన్స్ చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.