AP: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. వ్యక్తిగత పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.