AP: నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి, ‘తగిన వ్యక్తికి తగిన గౌరవం’ విధానంతో అవకాశం కల్పించామన్నారు. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసింది. రెండో లిస్టులో ఏకంగా 62 మందిని చైర్మన్లుగా, సలహాదారులుగా నియమించింది.