AP: పోలవరం కోసం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు కుంటుపడ్డాయన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఐదేళ్లలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన కేంద్రానిది కాదన్నారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ఆలోచిస్తోందని తెలియజేశారు.