AP: రేపు విశాఖ స్టీల్‌ప్లాంట్ సందర్శనకు కేంద్రమంత్రి కుమారస్వామి కూడా తనతో వస్తున్నారని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పూర్తిస్థాయి ఉత్పత్తి సమర్థ్యం సాధిస్తామని అన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యమని చెప్పారు. కేంద్రం తన వంతుగా రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని గుర్తు చేశారు.