TG: కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కూర్చొని KTR దొంగ మాటలు మాట్లాడారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధికి పదేళ్లు ఏం చేశారో చర్చకు రండి అని సవాల్ విసిరారు. పథకాల పేరు చెప్పి అన్నింటిలో దోచుకున్నారని ఆరోపించారు. చీపుర్లు పట్టి మహిళలే kTRను తరిమికొడతారని విమర్శించారు. మంచి ఉద్దేశంతో కులగణన చేస్తుంటే ఎదురు తిరగాలని KTR చెబుతున్నారని మండిపడ్డారు. KTRపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.