మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫడ్నవీస్‌కు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. కాగా, ఫడ్నవీస్‌కు ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్లకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారట. అంతేకాకుండా శివసేనకు 12, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందట.