రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. ‘దేశ ప్రజలకు రాజ్యాంగ వజ్రోత్సవాల శుభాకాంక్షలు. చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులు భాగస్వామ్యం అవుతున్నారు. 75 ఏళ్ల కిందట ఇదే రోజున ఆమోదం పొందిన రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు’ అని పేర్కొన్నారు.