AP: NTR జిల్లా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు సంస్థ పెట్టుబడుల పేరిట 1044 మంది నుంచి రూ.21.37 కోట్లు వసూలు చేసిందని గుర్తించారు. ఈ క్రమంలో బాధితులకు న్యాయం చేసేలా కార్యాచరణ చేపట్టారు. పెట్టిన పెట్టుబడి కంటే అదనంగా లబ్ధి పొందినవారిని విచారించిన పోలీసులు.. అదనపు డబ్బును వెనక్కి ఇచ్చేయాలని అల్టిమేటం జారీ చేశారు.