AP: వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయని, వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడన్నారు. తిరుమల శ్రీవారు ఇతన్ని శిక్షించడా? హిందూ ధర్మశాస్త్రం/కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తించదా? అని ‘X’లో మండిపడ్డారు.