అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు దుండగులు బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఒరెగాన్లోని పోర్ట్లాండ్ ప్రాంతంలో జరిగింది. వాషింగ్టన్‌లోని వాంకోవర్లోనూ మరో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు డ్రాప్ బాక్సులు కాలిపోవడంతో ఫెడరల్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చారని వెల్లడించారు.