మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని వెల్లడించారు. పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తున్న వాటిపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు. భారీగా నగదు దొరికినట్లు వార్తలు వచ్చినా కేసు ఎందుకు నమోదు చేయలేదని పేర్కొన్నారు. దాడుల తరువాత మంత్రి రహస్యంగా అదానితో రహస్యంగా సమావేశమయ్యారన్నారు.