గంగవల్లి ఆకులో విటమిన్ A, B, Cలతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత దరిచేరదు. ఎముకలు దృఢంగా మారుతాయి. కంటి సమస్యలు తగ్గుతాయి. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.