TG: రాష్ట్రంలో నేటి నుంచి కుల గణన ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఒంటిపూట బడులు నిర్వహించవద్దని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ‘టీచర్లను కులసర్వేలో ఉపయోగించడం అంటే విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకు నడపడం సరికాదు. దాని వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు’ అని అన్నారు.