Heavy Rains : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడును మరో సారి వర్షం ముంచెత్తబోతుంది. రానున్న ఏడు రోజుల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది. దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖ, హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరానికి దగ్గరగా వచ్చింది.
కన్యాకుమారిలో భారీ వర్షం హెచ్చరిక
ఈ వాతావరణ మార్పు కారణంగా ఆదివారం దక్షిణ తమిళనాడులో పలుచోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు కన్యాకుమారితో పాటు తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగై, విరుదునగర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు
రేపు సోమవారం దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని రామనాథపురం, శివగంగై, విరుదునగర్, తంజావూరు, పుదుక్కోట్టై, తేని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా బుధవారం నుంచి శనివారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.