తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. అయితే ఈ మూవీ విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ మూవీ నిర్మాత KE జ్ఞానవేల్ తమ దగ్గర తీసుకున్న అప్పు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే ‘కంగువ’ను రిలీజ్ చేయాలని రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మద్రాసు కోర్టులో పిటిషన్ వేసింది. తమ దగ్గర రూ.99.22 కోట్లు తీసుకున్నారని.. ఇంకా రూ.45 కోట్ల మేర చెల్లించాలని పేర్కొంది. దీనిపై ఈ నెల 7న విచారణ జరగనుంది.