Allu Arjun: ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ, లోక్సభ స్థానాలను టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రా రాజకీయాల్లో మోస్ట్ సెలెబ్రేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయంతో గెలుపొందారు. దేశంలోని తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లోని అభిమానులు సోషల్ మీడియాలో, వెలుపల పెద్ద ఎత్తున వేడుకలు ప్రారంభించారు. అందులో భాగంగా ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవికి ప్రచారం చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేస్తుండటం విశేషం.
నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓటమి చవిచూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ పదకొండు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కాగా, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీన్ని చాలామంది జనసైనికులు తప్పుబట్టారు. కుటుంబానికి చెందిన జనసేనకు మద్దతివ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అల్లు అర్జున్, రవిచంద్రపై అనుమతి లేకుండా జనాలను పోగు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఫ్యామిలీని వదిలేసి మరీ.. వైసీపీ నేతకు సపోర్ట్ చేశారంటూ , ఫలితాలు వెలువడిన తర్వాత.. మరీ దారుణంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం గమనార్హం. అయితే.. పవన్ గెలిచాడు అని తెలిసిన వెంటనే… అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో కొంత మంది మాత్రం శాంతపడ్డారు. కానీ.. ఇఫ్పటికీ పూర్తిగా ట్రోల్స్ ఆగకపోవడం గమనార్హం.