‘మన శంకరవరప్రసాద్ గారు’లో చిరంజీవి టైమింగ్‌ని పూర్తిగా వాడుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ చిత్రం అభిమానులకు రెండున్నర గంటల పాటు ‘టైమ్ మెషిన్’ రైడ్ లాగా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. ‘లీడర్ రాజు’ (ముఠామేస్త్రి), ‘ఆటో జానీ’ (రౌడీ అల్లుడు), ‘గ్యాంగ్ లీడర్’లోని రఘురామ్ పాత్రలను ఆధారంగా చేసుకుని ఆయన పాత్రను తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చాడు.