DEVARA: ‘దేవర’ ఇన్ అండర్ వాటర్.. ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనింగ్!
దేవర కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కోస్టల్ ఏరియాలో దేవర చేసే యుద్ధం మామూలుగా ఉండదని.. తన హీరో చేసే మృగాల వేట నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందని.. ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకు తగ్గట్టే లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది.
ట్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. కానీ ఆచార్య సినిమాతో దారుణమైన ఫ్లాప్ చూశాడు కొరటాల శివ. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండదని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఎప్పుడో కొరటాలకి మాటిచ్చేశాడు. అందుకే ఆచార్యతో కొరటాల పనైపోయిందని ఎవ్వరు చెప్పినా కూడా పట్టించుకోలేదు తారక్. కొరటాల కూడా దేవర స్క్రిప్ట్ కోసం దాదాపు ఏడాది కాలం సమయం తీసుకున్నాడు. ఇక షూటింగ్ మొదలైన తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే.. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. విఎఫ్ఎఅక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే భారీ యాక్షన్స్ షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేశాడు. ఇక తాజాగా ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం తారక్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ముంబాయి నుంచి వచ్చిన ట్రైనర్ల నెపథ్యంలో సముద్ర గర్భంలో యుద్ధానికి రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. సముద్రం మీద, తీర ప్రాంతాలతో పాటు అండర్ వాటర్‌లో భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ఉంటాయట. అందుకే ఇప్పుడు యంగ్ టైగర్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
దీంతో దేవర పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. నందమూరి ఆర్ట్స్ మరియు యుద సుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్నఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ ఈసారి పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.