ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చెన్నైలో తాజాగా ఈ చిత్రం ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘పుష్ప’ టైటిల్ పాటకు అల్లు అర్జున్ స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. ‘కిస్సిక్’ పాటకు శ్రీలీల స్టెప్పులేశారు. అలాగే పెళ్లి గురించి రష్మీక పరోక్షంగా కామెంట్స్ చేశారు. తనకు ఎవరు ఇష్టమనే విషయం అందరికి తెలుసని అన్నారు.