కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ ‘విక్రమ్’ 2022లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూవీలో క్యామియో రోల్ రోలెక్స్ పాత్రలో హీరో సూర్య అదరగొట్టాడు. అయితే ఈ పాత్ర గురించి ‘కంగువా’ ప్రమోషన్స్‌లో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం తాను స్మోక్ చేశానని వెల్లడించాడు. కాగా ‘కంగువా’దీపావళి సందర్భంగా ఈనెల 31న విడుదల కానుంది.