ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీపై నంద్యాల YCP నేత శిల్పా రవి ట్వీట్ చేశారు. ‘ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. దీంతో బన్నీ.. ‘థ్యాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా, వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.