హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షీ చౌదరి నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీనాక్షీ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు. ఒకే తరహా చేస్తే నటిగా నాకే కాదు.. స్క్రీన్‌పై చూసే ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. అందుకే వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతా’ అని అన్నారు.