నటుడు విజయ్ వర్మ తన కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించి మెప్పించారు. అదే తనకు ఇబ్బంది అంటూ ఓ ఈవెంట్లో చెప్పారు. ‘తెరపై నన్ను విలన్‌గా చూడడంతో పాటు కొందరు అమ్మాయిలు, వాళ్ల మదర్స్ భయపడుతున్నారు. పింక్ చిత్రంతో అది ప్రారంభమైంది. ఆ సినిమా పూర్తయ్యాక కొందరు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో గాయని సునిధీ చౌహాన్‌ను ఓదార్చే ప్రయత్నం చేయబోగా.. నా వద్దకు రావద్దన్నారు’ అని చెప్పుకొచ్చారు.