»Why Has The Us Passed A Bill To Ban Tiktok And Whats Next
TikTok Ban : టిక్ టాక్ పై బ్యాన్.. భారత్ బాటలో అమెరికా!
భారత్‌లో ఎప్పటి నుంచో టిక్ టాక్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో అమెరికా కూడా ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసింది.
TikTok Ban in US: చైనాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ టిక్‌టాక్‌ను అమెరికా బ్యాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును అక్కడి ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లుకు మద్దతుగా 352 మంది ఓటు వేయగా, 65 మంది మాత్రం వ్యతిరేకించారు. దీంతో బిల్లు సెనేట్‌కు చేరింది. సెనేట్ దీనికి వెంటనే ఆమోదం తెలిపి అధ్యక్షుడు బైడెన్‌కు పంపాలని సూచించారు. దీంతో టిక్ టాక్‌పై నిషేధం షురూ అయ్యింది.
టిక్ టాక్‌ను బైట్ డ్యాన్స్ అనే సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. టిక్ టాక్(TikTok) యాజమాన్యం మొత్తం పూర్తిగా దాని చేతిలోనే ఉంది. ఆ చైనా కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ(CCP) అధీనంలో పని చేస్తుంది. టిక్‌టాక్ సాధారణంగా పని చేస్తే ఫర్వాలేదు కాని సీసీపీ అధీనంలో మాత్రం ఆ పని చేయడానికి లేదని సెనేట్ బిల్లులో అమెరికా పేర్కొంది. దేశ భద్రత, సమాచార గోప్యతను కాపాడేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. టిక్‌టాక్ వల్ల ప్రయోజనాలూ ఉన్నాయని, కానీ దాని అల్గారిథమ్, అందులో నిక్షిప్తమయ్యే సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లొద్దనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామని వెల్లడించింది.
ప్రపంచం మొత్తం మీద టిక్‌టాక్‌ను నిషేధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. యూజర్ల వ్య్తిగత సమాచారాన్ని సేకరిస్తూ వ్యక్తులపై నిఘా పెడుతోందని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో ఈ యాప్‌ను బ్యాన్ చేసింది. తర్వాత పలు ప్రపంచ దేశాలు అదే బాటలో నడిచాయి. ట్రంప్ హయాంలో అమెరికాలోనూ దీనిపై చర్చ నడిచింది తప్ప ఆచరణలోకి రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఇది అమెరికాలోనూ(US) కార్యరూపం దాలుస్తోంది. టిక్‌టాక్‌కు అమెరికాలో సుమారు 150 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ యాప్ వద్ద ఉన్న అమెరికన్ల సమాచారం చైనా దక్కించుకునే అవకాశం ఉందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధం వార్తలు వస్తున్నాయి.