Manchu Manoj : మంచు మనోజ్ పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. ఆయన పెళ్లి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె భూమా మౌనికతో కుదిరిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో... వారి పెళ్లి కి ఇరువైపులా పెద్దలు అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా.... ఇప్పుడు ఆయన పెళ్లి తేదీ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
మంచు మనోజ్ పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. ఆయన పెళ్లి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె భూమా మౌనికతో కుదిరిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో… వారి పెళ్లి కి ఇరువైపులా పెద్దలు అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా…. ఇప్పుడు ఆయన పెళ్లి తేదీ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
మార్చి 4వ తేదీ పెళ్లి ఫిక్స్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇటు మంచు కుటుంబం నుండి కానీ, అటు భూమా కుటుంబం నుండి కానీ ఎటువంటి అధికారిక వార్తలు మాత్రం వెలువడలేదు.
వీరిద్దరి వివాహానికి మంచు వారింట్లో ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి అని మాత్రం వినపడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దానిని బట్టి మార్చి 4వ తేదీన వివాహం జరగనుందని సమాచారం. వేదిక ఎక్కడనేది ఇంకా తెలియదు. మంచు మనోజ్ కి తన అక్క మంచు లక్ష్మి తో మంచి అనుబంధం ఉండటం వలన, పెళ్లి పనులు అన్నీ మంచి లక్ష్మి ఇంట్లో జరుగుతున్నాయని, అందులో భాగం గానే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.
మహా మంత్ర యాగం కూడా జరిపించారని, ఆ పూజా కార్యక్రమం జరుగుతుండగా తీసిన ఫోటోలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పూజ కి మంచు కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం.