ఉత్తరప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు వినూత్న మోసానికి తెరదీశారు. ఫేస్బుక్లో ఓ వ్యక్తి ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5లక్షల ఉద్యోగం ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. ఈ ఆఫర్ చూసిన ఓ యువకుడు అతడిని సంప్రందించాడు. దీంతో ఆ యువకుడి నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24,800 కట్టించుకున్నాడు. అనంతరం రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.