ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని గుంటూరులో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ తాంత్రికుడు ఏకంగా యువతులతో క్షూద్రపూజలు చేయించాడు. అదికూడా మాములుగా కాదు. అమ్మాయిలను నగ్నంగా మార్చి ఈ తంతు నిర్వహిస్తున్నాడు. అయితే పలువురు యువతులు తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గూంటూరు జిల్లా పొన్నెకల్లుకు చెందిన ఓ వ్యక్తి ఇదంతా చెస్తున్నాడని తేలింది. మంత్ర పూజల ద్వారా డబ్బులు సంపాదించవచ్చని యువతులకు మాయ మాటలు చెప్పి మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ సులభంగా మనీ సంపాదించవచ్చని ఈ తాంత్రికుడిని ఆశ్రయించింది. ఆ క్రమంలో ఆమె సాయంతో మరికొంత మంది అమ్మాయిలకు వల వేశారు. అంతేకాదు ఈ దుండగుడు సోషల్ మీడియా ద్వారా కూడా పలువురు యువతులతోపాటు మహిళలను కూడా ట్రాప్ లోకి దింపాడు.
ఈ నేపథ్యంలోనే కర్నూల్ జిల్లాకు చెందిన ఇంకొంత మంది యువతులను కూడా ట్రాప్ చేశారు. వారితో 10 రోజులు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నగ్నంగా క్షుద్రపూజలు చేయించారు. అయితే అలా 10 రోజులు చేసిన తర్వాత డబ్బులు ఇస్తామని ఇవ్వకుండానే పంపించారు.
ఆ తర్వాత కూడా అదే విధంగా ప్రయత్నించగా..వాహనం ఆగిన సమయంలో యవతులు తప్పించుకుని పారిపోయారు. ఆ క్రమంలో పోలీసులను ఆశ్రయించి వారికి సమాచారం అందించారు. దీంతో అలాంటి దొంగబాబాల మాయమాటలు నమ్మోద్దని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో తాంత్రికుడికి సాయం చేసిన మహిళను అరెస్టు చేయగా..తాంత్రికుడు తప్పించుకున్నాడని తెలిసింది.