ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దంతేరపల్లి గ్రామంలో సారమేకల హరి(53) అనే వ్యక్తి మంగళవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. వ్యక్తి మృతికి గల కారణాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.