హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన ఒక చిన్నారి మృతి చెందింది. మరో తొమ్మిది మంది వలస కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. ఈ మంటలు పక్క భవనాలను తాకడంతో దాదాపు 10 నుంచి 15 దుకాణాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి సహాయక చర్యలు చేపట్టారు.