TG: హైదరాబాద్ సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాణిగంజ్‌లో అగ్నినివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో.. పరికారాలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జిరిగినట్లు సిబ్బంది భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.