NDL: సంజామల మండలంలో రీ-సర్వే పూర్తయిన 9 గ్రామాల్లో రేపటి నుంచి నవంబర్ 2వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు దత్తాపురంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కాగా విస్తీర్ణంలో వ్యత్యాసాలు, LPMs, మ్యూటేషన్, ఖాతాలో, పేర్లలో తప్పులతో పాటు ఇతర సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చు అన్నారు.