SKLM: వలసలు నివారించి మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మామిడివలసలో ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 100 శాతం రాయితీపై చేపలను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.