W.G: భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో పట్టణానికి చెందిన చల్ల శ్రీనివాస్ 13 కేజీల వెండి, కేజీ బంగారంతో తయారుచేసిన విల్లుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఈ విల్లును అయోధ్యలోని రామ మందిరానికి తరలిస్తున్నారని, అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు.