కోనసీమ: సొసైటీల ద్వారా రైతులకు ఇచ్చే పంట రుణాలపై వడ్డీని తగ్గించాలని కోరుతూ జిల్లా ఇంఛార్జి మంత్రి అచ్చెన్నకు అమలాపురంలో మంగళవారం వినతిపత్రం ఇచ్చామని మామిడికుదురుకు చెందిన రాజోలు నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు ఈలి శ్రీనివాస్ తెలిపారు. పంట రుణాలపై వడ్డీ 7% వసూలు చేస్తున్నారని ఏడాది ముగిసిన తర్వాత దాన్ని 13% పెంచుతున్నారని తెలిపారు.