తూ.గో: నేటి నుంచి పాపికొండల విహారయాత్రలు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం కారణంగా 4 నెలల విరామం తర్వాత విహారయాత్రకు టూరిజం శాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గుడి నుంచి బోట్లు బయల్దేరనున్నాయి. దీనితో పర్యాటకులలో సందడి మొదలయింది. వచ్చేది కార్తీక మాసం కావడంతో మరింత మంది పర్యాటకులు రానున్నారు.