NLR: సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు అక్కడి న్యాయవాది ధర్మాన ప్రసాద్‌ను దూషిస్తూ వ్యవహరించిన తీరుపై మంగళవారం నాయుడుపేట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేటలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయస్థానం ఎదుట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెసల గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్సైపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.