ప్రకాశం: గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో నవంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి వార్డ్ సచివాలయ సిబ్బంది ప్రారంభించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పెన్షన్లు పంపిణీ చేసే సర్వర్లు మొరాయించడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. పెన్షన్ దారులు వార్డ్ సచివాలయాల దగ్గర ప్రదక్షణలు చేశారు.