SKLM: మహిళా స్వయం శక్తి సంఘాలు, గ్రామ సంఘాలలో వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేయడంతో పాటు, అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచాలని వెలుగు ఏ.పి.ఎం. పైడి కూర్మారావు సూచించారు. శనివారం హిరమండలం కోరాడ గ్రామంలో గల సాయిబుల వీధిలో స్వయం శక్తి సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనవసరపు ఖర్చులను తగ్గించుకొని, లాభదాయకంగా ఉండాలని తెలిపారు.