»Nara Lokeshs Letter To Cm Jagan 90 Days Time Should Be Given For Group1 Mains Students 2023
Nara Lokesh: AP CM జగన్ కు నారా లోకేష్ లేఖ..90 రోజుల టైం ఇవ్వాలి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.
ఏపీ సీఎం జగన్(ap cm jagan) మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) లేఖ(letter) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు. మెయిన్స్ ఎగ్జామ్ లో ఏడు పేపర్లు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు టెంన్షన్ పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు మరికొంత సమయం ఇచ్చి ప్రభుత్వం వారికి అండగా ఉండాలని తెలిపారు. దీంతోపాటు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేకపోవడంతో యువత నిరాశతో ఉన్నట్లు గుర్తు చేశారు.
ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కూడా నిబంధనలు పట్టించుకోవడం లేదన్నారు. పాదయాత్రలో జగన్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను లోకేష్ చూపించి ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి నాలుగేళ్లు దాటిందని అన్నారు. ఈ క్రమంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఆవేదనతో ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు ఏపీలో ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్(cm jagan) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని APJAC ఆరోపించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (APJAC అమరావతి) మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆందోళన చేపడుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఈహెచ్ఎస్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ నిర్ధారణ వంటి సమస్యలు ఉన్నాయని జేఏసీ నాయకులు అసోసియేషన్ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతోపాటు జీపీఎఫ్(GPF), ఏపీజీఎల్ఐ, సెలవు తదితర పెండింగ్ బిల్లులు కూడా ఉన్నట్లు తెలిపారు.