»Minister Dharmana Prasada Rao Clarity On Increase Electricity Charges In Andhra Pradesh
Dharmana prasada rao: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ
ఏపీలో గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయనే చర్చ నేపథ్యంలో తాజాగా క్లారిటీ వచ్చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు కరెంట్ ఛార్జీలు పెంపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గతంలో కంటే పెరిగిందని గుర్తు చేశారు.
Minister dharmana prasada rao Clarity on Increase Electricity Charges in andhra pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(andhra pradesh)లో ఎట్టకేలకు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు(dharmana prasada rao) క్లారిటీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని..ఆ క్రమంలో ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి ధర్మాన ఈ మేరకు స్పష్టం చేశారు. అంతేకాదు వినియోగదారుల కరెంట్ అవసరాలు తీర్చేందుకు అదనపు విద్యుత్ భారాన్ని (Electricity Charges)వినియోగదారులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు హింసించే మాదిరిగా తమ ప్రభుత్వం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు రాష్ట్రంలో కరెంటు, పప్పు, నూనె ధరలు పెరిగిన మాట వాస్తవమే. కానీ ధరలు పెరగడం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. ధరల పెరుగుదలపై వాస్తవాలను దాచిపెట్టి టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. 4,200 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి.. టైటిల్ ఫ్రీ రికార్డులు సృష్టిస్తున్నారని చెప్పారు. 14 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు..పారిశ్రామిక అభివృద్ధి, కొత్త విధానాలపై పవన్ కల్యాణ్, చంద్రబాబు(chandrababu) చర్చించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం వృథా, నిధుల దుర్వినియోగమో చెప్పాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని చెబుతున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పాలన్నారు. సగటు ప్రజల జీవన ప్రమాణం అభివృద్ధి కాదని, భవనాలు నిర్మించడం అభివృద్ధి కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు.