GNTR: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను సీఎం అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు.